Share News

ఆదిత్యాలయాన్ని సందర్శించిన అభివృద్ధి కమిటీ

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:19 AM

ఆదిత్యాలయ అభివృద్ధికి సంబం ధించి ఐదుగురు సభ్యుల భూ బదలాయింపు కమిటీ సభ్యులు శనివారం ఆలయాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు.

ఆదిత్యాలయాన్ని సందర్శించిన అభివృద్ధి కమిటీ
సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు, అర్చకులు

అరసవల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆదిత్యాలయ అభివృద్ధికి సంబం ధించి ఐదుగురు సభ్యుల భూ బదలాయింపు కమిటీ సభ్యులు శనివారం ఆలయాన్ని సందర్శించి పరిస రాలను పరిశీలించారు. దేవదాయశాఖ కమిషనర్‌, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్జేసీ వి.త్రినాథరావు, సింహాచలం దేవస్థానం డీసీ సుజాత, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, సుడా ఎస్‌ఈ పొగిరి సుగుణాకరరావు, ఆదిత్యాలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం సేకరిస్తున్న 1 ఎకరా 23 సెంట్ల స్థలాలను, వారికి బదలాయించేందుకు చిన్నతోట వద్ద ఉన్న స్థలాలను పరిశీలించారు. అన్నదాన మండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, డార్మిటరీ, కేశఖండన శాల, పార్కింగ్‌ కోసం స్థల పరిశీలన చేశాారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజే స్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తదితరు లు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్జేసీ త్రినాథరావు, డీసీ సుజాత స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఈవో జ్ఞాపికలు అందించారు.

Updated Date - Dec 21 , 2025 | 12:19 AM