డీఆర్ వలసలో నవగ్రహ విగ్రహాల ధ్వంసం
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:03 AM
డీఆర్ వల స శివాలయం ప్రాంగణం లోని శనీశ్వరుని ఆలయం లో గల నవగ్రహ విగ్రహా లను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగు లు ధ్వంసం చేశారు ఆల య అర్చకుడు శనివారం ఉదయం ఆలయానికి చేరు కుని చూడగా విగ్రహాలు ధ్వంసమైనట్లు గుర్తించి గ్రామస్థులకు తెలిపాడు.
జి.సిగడాం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): డీఆర్ వల స శివాలయం ప్రాంగణం లోని శనీశ్వరుని ఆలయం లో గల నవగ్రహ విగ్రహా లను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగు లు ధ్వంసం చేశారు ఆల య అర్చకుడు శనివారం ఉదయం ఆలయానికి చేరు కుని చూడగా విగ్రహాలు ధ్వంసమైనట్లు గుర్తించి గ్రామస్థులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు చేరుకుని ఆలయాన్ని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు దేవాలయాలపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడుల నింది తులను పట్టుకోవడంలో ఎటువంటి పురగతిలేదని, హిందూ దేవాలయాలపై దాడులు చేయడం దారుణమని, తక్షణం బాధ్యులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.