Share News

కేజీబీవీలో డిప్యూటీ కలెక్టర్‌ విచారణ

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:50 PM

లోలుగు కేజీబీవీలో అక్రమాలు, ప్రిన్సిపాల్‌ సౌమ్యపై వచ్చిన ఫిర్యాదుల మేరకు డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత గురువారం విచారణ చేప ట్టారు.

 కేజీబీవీలో డిప్యూటీ కలెక్టర్‌ విచారణ
రికార్డులను పరిశీలిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత

పొందూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): లోలుగు కేజీబీవీలో అక్రమాలు, ప్రిన్సిపాల్‌ సౌమ్యపై వచ్చిన ఫిర్యాదుల మేరకు డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత గురువారం విచారణ చేప ట్టారు. ప్రిన్సిపాల్‌ పనితీరుపై ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ కిరణ్‌ కుమారి, వైస్‌చైర్మన్‌ పారన్నాయుడు రాష్ట్ర విద్యా శాఖామంత్రి లోకేశ్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌, విద్యాశాఖ ఉన్నతాధి కారులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టారు. మూడు రోజులుగా అధికారులు తని ఖీలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత విస్తృతంగా తనిఖీ చేసి రికార్డులు, ఖర్చులకు సంబంధించి చెక్కులను పరిశీలించి ప్రిన్సిపాల్‌ సౌమ్యను వివరాలు అడిగి తెలసుకున్నారు. విద్యా ర్థినులతో మాట్లాడారు. వివాదాల్లోకి విద్యార్థినులను తీసుకురా వద్దని సిబ్బందికి హెచ్చరించారు. వసతులు, భోజన సదుపా యాలపై ఆరా తీశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిం చనున్నట్లు డిప్యూటీ కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jul 24 , 2025 | 11:50 PM