Share News

మేజర్‌కు డిప్యూటీ సీఎం అభినందన

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:32 AM

ఇటీవల కీర్తిచక్ర పురస్కారం అందుకున్న మండలంలోని నగిరిపెంట గ్రామాని కి చెందిన ఆర్మీ మేజర్‌ మల్ల రామ్‌గోపాలనాయుడును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.

మేజర్‌కు డిప్యూటీ సీఎం అభినందన
మేజర్‌ రామ్‌గోపాలనాయుడును అభినందిస్తున్న పవన్‌ కల్యాణ్‌

సంతబొమ్మాళి, జూన్‌6(ఆంధ్రజ్యోతి): ఇటీవల కీర్తిచక్ర పురస్కారం అందుకున్న మండలంలోని నగిరిపెంట గ్రామాని కి చెందిన ఆర్మీ మేజర్‌ మల్ల రామ్‌గోపాలనాయుడును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. గురువారం రాత్రి విజయవాడలో రామ్‌గోపాలనాయుడు కుటుంబ సభ్యు లతో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. దేశ రక్షణలో రామ్‌గోపా లనాయుడు చూపిన దైర్య సాహసాలను ఆయన కొనియాడా రు. యువత రామ్‌గోపాలనాయుడును ఆదర్శంగా తీసుకొని రక్షణ రంగంలో రాణించాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాక్షించినట్టు మేజర్‌ తండ్రి మల్ల అప్పలనాయుడు తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 12:32 AM