Share News

Departmental exams : నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:32 PM

Government employees Exam schedule ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

Departmental exams : నేటి నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు
మాట్లాడుతున్న డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు

  • పకడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా రెవెన్యూ అధికారి వేంకటేశ్వరరావు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), కోర్‌ టెక్నాలజీస్‌ (నరసన్నపేట) కేంద్రాల్లో ఆదివారం నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 20 నిమిషాల అదనపు సమయం, స్కైబ్ర్‌ సదుపాయం కల్పించాలి. అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, ప్రాథమిక చికిత్స, పోలీసు బందోబస్తు తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులను ఉదయం పరీక్షలకు 8-30 నుంచి 9-15 వరకు, మధ్యాహ్నం పరీక్షలకు 1-30 నుంచి 2-15వరకు అనుమతించాలి. సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు అభ్యర్థులు, ఇన్విజిలేర్లకు అనుమతి లేద’ని తెలిపారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు భోగేశ్వరి, పి.పద్మప్రియ, ఇతర శాఖల ప్రతినిధులు, లైజనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:32 PM