ఘనంగా దీపోత్సవం
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:56 PM
వినాయక నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని కనకల వీధిలో దీపారాధాన నిర్వహించారు. శివలింగంతో పాటు వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించారు. కార్యక్ర మంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.
పొందూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని కనకల వీధిలో దీపారాధాన నిర్వహించారు. శివలింగంతో పాటు వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించారు. కార్యక్ర మంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.
పాలఖండ్యాంలో నిమజ్జనం
జి.సిగడాం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాలఖండ్యాం కూడలి లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం గణనాథుని విగ్రహాన్ని గ్రామంలో మేళతాళాలు, నృత్యాలు, భారీ బాణసంచా కాల్పుల మధ్య ఊరేగించి గ్రామ శివారులో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.
సింహాద్రి అప్పన్న రూపంలో..
కంచిలి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బూరగాంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బూరగాం-సోంపేట మార్గంలో సింహాద్రి అప్పన్న రూపంలో గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు, నిర్వాహకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.
చినమురపాకలో హోమం..
లావేరు, సెప్టెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): చినమురపాకలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం హోమం, ప్రత్యేక పూజలు చేప ట్టారు. ఈ పూజల్లో చినమురపాక, మురపాక, చిత్రిపేట, గొల్లపేట తదితర గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. రాత్రి భజన చేపట్టారు.
లడ్డూ వేలం
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెల్లుపడ వీధిలో గణనాథుని మండపంలో గురువారం లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏఎస్‌ఐ పోతల అప్పలరెడ్డి రూ.16500కు లడ్డూను సొంతం చేసుకున్నారు.
అలరించిన నాట్య ప్రదర్శనలు
కవిటి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రుల సందర్భంగా మాణిక్యపురంలో బుధవారం రాత్రి నిర్వహించిన నాట్య ప్రదర్శనలు అల రించాయి. ఇచ్చాపురానికి చెందిన కళాకారులు భరత నాట్యంతోపాటు ఒరి యా సంబల్పూరి, జానపద నృత్యాలను చేశారు. 25మంది చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకర్షించాయి. కళాకారులను ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు.
గరికిపాలెంలో సామూహిక పూజలు
రణస్థలం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): గరికిపాలేం సినిమా థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మందిరం వద్ద హైపర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సామూహిక కుంకమ పూజలు నిర్వహించారు. మేడూరి బాలకృష్ణ శర్మ, శివ సమక్షంలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.