మతిస్థిమితంలేని మహిళ మృతి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:10 AM
నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతిస్థిమితం లేని మహిళ మృతదేహాన్ని పెద్ద చెరువులో గుర్తించామని వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
విజయనగరం క్రైం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతిస్థిమితం లేని మహిళ మృతదేహాన్ని పెద్ద చెరువులో గుర్తించామని వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబం ధించిన వివరాల్లోకి వెళితే.. నగరంలోని కొడుగంటేరువారి వీధికి చెందిన కె.ఇందిర (60) మతిస్థిమితం లేక ఇంటి నుంచి బయటకు వెళ్లి రోజూ ఏదో సమయానికి ఇంటికి చేరుకునేదన్నారు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఆమె ఇంటికి కాకపోవడంతో చుట్టుపక్కలా కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపిం చకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుందని వారు భావించారు. ఈక్ర మంలో కొంత మంది వద్ద పెద్దచెరువులో మహిళ మృతదేహం ఉందని తెలి యడం తో భర్త చంద్రన్ వెళ్లారు. మృతదేహం తన భార్యదేనని గుర్తించాడు. చంద్రన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.