మతిస్థిమితంలేని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:10 AM
స్థానిక బాలాజీనగర్‌కు చెందిన తడక లక్ష్మీనారాయణ(84) అనే వృద్ధుడు కోదూరు గ్రామ చేరువలో గల పంట పొలా ల్లో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగుచూసింది.
పాతపట్నం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక బాలాజీనగర్‌కు చెందిన తడక లక్ష్మీనారాయణ(84) అనే వృద్ధుడు కోదూరు గ్రామ చేరువలో గల పంట పొలా ల్లో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బాలాజీ నగర్‌లో ఉంటున్న తడక లక్ష్మీనారాయణ గత రెండేళ్లు గా మతిస్థిమితం లేక తిరుగుతున్నాడు. ఎనిమిది రోజు ల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే బుధవారం మండల పరిధి కోదూరు గ్రామ చేరువలో గల పంట పొలాల్లో లక్ష్మీనారాయణ మృతదేహం ఉన్నట్టు అదేవీధికి చెందిన బమ్మిడి వైకుంఠరావు చెప్పగా కుటుంబ సభ్యులు వెళ్లి గుర్తించారు. లక్ష్మీనారాయణ కుమారుడు తడక దాలయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.మధుసూధనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.