Share News

వంశధార తీరంలో మృతదేహం కలకలం

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:06 AM

వంశధార నదీ తీరంలో తెలికిపెంట బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని తెలియడంతో ఆదివారం కలక లం రేగింది.

వంశధార తీరంలో మృతదేహం కలకలం

సరుబుజ్జిలి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వంశధార నదీ తీరంలో తెలికిపెంట బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని తెలియడంతో ఆదివారం కలక లం రేగింది. ఎవరైనా హత్య చేశారా? లేక ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పాతి పెట్టారా? అన్న పుకార్లు షికార్లు చేశాయి. విషయం తెలుసుకున్న సరుబు జ్జిలి పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. జలుమూరు మండలం కొండ కామేశ్వరపేటకి చెందిన ఓ బిచ్చగాడు అనారోగ్యం తో మృతి చెందాడు. వంశధార ఆవలి ప్రాంతం సక్రమంగా లేకపోవడంతో తెలికి పెంట బ్రిడ్జి సమీపంలో దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు సిద్ధమ య్యారు. అయితే ఈ విషయం తెలికిపెంట గ్రామస్థులకు తెలియడంతో అభ్యం తరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వారిలో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరుపక్షాలకు ఇబ్బంది లేని ప్రదేశంలో దహన సంస్కారాలు చేయించడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - Aug 11 , 2025 | 12:06 AM