Share News

దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:39 PM

కోటబొమ్మాళి, బుడతవలస గ్రామాల దళితుల భూ సమస్యలను పరిష్కరించాలని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం డిమాండ్‌ చేశారు.

దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి
జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ నేతలు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి, బుడతవలస గ్రామాల దళితుల భూ సమస్యలను పరిష్కరించాలని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోటబొమ్మాళికి చెందిన 12 మంది దళితులకు 1976లో ప్రభుత్వం డి-పట్టాలు మంజూరు చేసిందని, నాటి నుంచి ఇప్పటి వరకు ఈ భూములను వారే సాగు చేసుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తు తం మూలపేటకు పోర్టు వచ్చిన తరువాత భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో కొందరు వ్యాపారులు రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరతీశా రన్నారు. దీంతో అధికారులు సదరు భూమిని గెడ్డ పోరంబోకుగా చెప్ప డం అన్యాయమన్నారు. గత ఏడాది రైతు భరోసా పడిందని, ఈ ఏడాది ఎందుకు పడలేదని ప్రశ్నించారు. అలాగే లావేరు మండలం బుడత వలసలో కూడా దళితులకు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టాలు మంజూరు చేసింది. దళితులు నీలగిరి తోట వేసుకుని జీవనం సాగి స్తుంటే, కొందరు పెత్తందారులు, ఆ భూమిలోని నీలగిరి తోటను దౌర్జ న్యంగా నరికి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణం బాధితు లకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం గ్రీవెన్స్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు దేవాది ఉమామహేశ్వరరావు, కుప్పిలి రాజారావు, కుప్పిలి మురళి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:39 PM