Share News

Culvert works యుద్ధప్రాతిపదికన కల్వర్టు పనులు

ABN , Publish Date - May 29 , 2025 | 11:37 PM

Culvert works నౌపడా- మెళియా పుట్టి స్టేట్‌ హైవే రోడ్డు పరిధిలోకల్వర్టు పనులు ముమ్మరం చేశారు.

Culvert works   యుద్ధప్రాతిపదికన కల్వర్టు పనులు
కల్వర్టుపై కాంక్రీట్‌ వేస్తున్న దృశ్యం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

టెక్కలి, మే 29(ఆంధ్రజ్యోతి): నౌపడా- మెళియా పుట్టి స్టేట్‌ హైవే రోడ్డు పరిధిలోకల్వర్టు పనులు ముమ్మరం చేశారు. ఐదు రోజులుగా కల్వర్టు పనులు నత్తనడకన సాగగుతుం డడంతో గురువారం ‘ఆంరఽధజ్యోతి’లో ‘తవ్వి వదిలేశారు’ శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పనుల నిర్వహణను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి పరిశీలించారు. అలాగే ఆర్‌అండ్‌బీ డీఈఈ రవికాంత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రామకృష్ణ, టెక్కలి ఈవో వెంకట్రావు, పోర్టు యంత్రాంగం కల్వర్టు, పైపులైన్‌ నిర్మాణ పనులు చేయించారు. శుక్రవారం నుంచి వాహనాలు నడి పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - May 29 , 2025 | 11:37 PM