Share News

రూ.20.05 లక్షలతో సాంస్కృతిక కళావేదిక

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:53 PM

అర సవల్లి కోనేరు సమీపంలో సాంస్కృతిక కళా వేదిక నిర్మా ణం చేపడుతున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. ఆదివారం వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రూ.20.05 లక్షలతో సాంస్కృతిక కళావేదిక
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

పాత శ్రీకాకుళం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అర సవల్లి కోనేరు సమీపంలో సాంస్కృతిక కళా వేదిక నిర్మా ణం చేపడుతున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. ఆదివారం వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎంపీ నిధులు రూ.20.05 లక్షల తో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వేదికతో పాటు ప్రవే శ ద్వారం, విడివిడి గదులు, బాత్రూమ్‌ తదితర నిర్మా ణాలు చేపట్టనున్నామన్నారు. దీనిని వివాహాలు తదితర వేడుకలు నిర్వహించేందుకు అనువుగా తీర్చిదిద్దనున్న ట్లు పేర్కొన్నారు. రానున్న అసిరితల్లి పండుగ, రథ సప్తమి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, కాలువ లు, ప్రధాన మార్గాల అభివృద్ధి పనులు చేపడుతున్నా మన్నారు. అరసవల్లి-కళ్లేపల్లి రోడ్డును వెడల్పుతో పాటు, వెలమ వీధి, తోట రోడ్డు తదితర ప్రతిపాదిత వీధుల్లో అసరమైన మేర రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టాలని అధికారు లను ఆదేశిం చారు. ఇంద్రపుష్కరిణి వెనుక రాణిగెడ్డ-రామిగెడ్డ ప్రాంతాలను ఆధునికీకరించి రోడ్డు వెడల్పు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌ విజయం సందర్భంగా అరసవల్లి టీడీపీ నాయ కులు, కార్యకర్తలు 100 కొబ్బరికాయలు కొట్టి సూర్య నారాయణ స్వామికి మొక్కు చెల్లించారు.

రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరవల్లి సూర్యనారాయణ స్వామి ఆల యంలో రఽథసప్తమి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్ల పై ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు ఏడు రోజులుపాటు నిర్వహించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై ఈవో కేఎన్‌ వీడీవీ ప్రసాద్‌, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మతో చర్చించారు. ప్రతీరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, ఏడు రోజుల పాటు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించే దిశలో ఆగ మ శాస్త్ర ప్రకారం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఆదిత్యుని సన్నిధిలో బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

పాత శ్రీకాకుళం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సత్య నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో కేఎన్‌ వీడీవీ ప్రసాద్‌ స్వాగతం పలుకగా అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసా దాలు, ఙ్ఞాపికలను అందజేశారు. సూర్యనారా యణ స్వామికి ఆదివారం టికెట్లు, పూజలు, విరాళాలు, ప్రసా దాల రూపంలో రూ. 8,77,505 ఆదాయం వచ్చినట్లు ఈవో ప్రసాద్‌ తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఆకుల మహేశ్వరరావు అన్నదానానికి ఉపయోగించే రూ.లక్ష విలువచేసే 10 స్టీల్‌ బెంచీలు, మర్రపు వెంకట నాయుడు, సత్యాదేవి రూ.20 వేలు విలువ చేసే రెండు స్టీలు బెంచీలు అందించారు. వీటిని ద్వారపు అజిత్‌ కుమార్‌, అనురాధ ఆధ్వర్యంలో ఈవోకి అందజేశారు.

Updated Date - Dec 07 , 2025 | 11:53 PM