సీడ్ డ్రిల్ యంత్రంతో సాగు లాభదాయకం
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:31 PM
వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు ఆలస్య మవుతున్నందున సీడ్ డ్రిల్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు.
కేవీకే కో-ఆర్డినేటర్ కె.భాగ్యలక్ష్మి
సరుబుజ్జిలి, జూలై 19(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు ఆలస్య మవుతున్నందున సీడ్ డ్రిల్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో సీడ్ డ్రిల్ యంత్రంతో సాగు చేసిన వరిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ యంత్రంతో మొక్కజొన్నతో పాటు 9 మందికి పైగా పంటల విత్తనాలు వేసే వీలుంటుందన్నారు. భూమిని దమ్ము చేసి నాట్లు వేయాల్సిన అవసరం లేకపో వడం వల్ల రైతుల కు సుమారు రూ.6 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు. కార్యక్ర మంలో రాయ్, హరి కుమార్, రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా కో-ఆర్డినేటర్లు అత్తు లూరి లావణ్య, పాతిని శ్రీనివాసరావు, శివ్వాల కుమారి తదితరులు పాల్గొన్నారు.