రోగులతో కిటకిట.. ఓపీ కోసం అగచాట్లు
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:59 PM
టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో సోమవారం రోగులతో కిటకిటలాడింది. కొద్దిరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో మంచంపట్టారు.దీంతో జ్వరపీడితుల తాకిడి పెరిగింది.
టెక్కలి, జూలై 14(ఆంధ్రజ్యోతి): టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలో సోమవారం రోగులతో కిటకిటలాడింది. కొద్దిరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో మంచంపట్టారు.దీంతో జ్వరపీడితుల తాకిడి పెరిగింది.ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 600క పైగా ఓపీనమోదైంది. వైరల్‌ఫీవర్స్, జ్వరాలు వంటి కేసులతో ఓపీ రద్దీగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యారావు తెలిపారు. అయితే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకు ఒకే క్యూలైన్ ఉండడం, త్వరగా లైన్‌క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోకపోవడంతో ఓపీవద్ద రోగులు అవస్థలుపడ్డారు.ఔట్‌పేషెంట్ వివ రాల నమోదుకు మరో కంప్యూటర్ ఏర్పాటుచేయాలని రోగులు కోరుతున్నారు.