సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:39 PM
ఉద్దానం ప్రాంతం పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్ అన్నారు.
సోంపేట/కవిటి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతం పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన సోంపేట, కవిటి మండలాల్లో పలు గ్రామాలను సందర్శించి పంటలను పరిశీలించారు. బెంకి లి, జింకిభద్ర గ్రామాల్లోని టమోటా పంట పొలాలను పరిశీ లించారు. కవిటిలో జీడి, కొబ్బరి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉద్యాన వన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకో వాలని కోరారు. కార్యక్రమంలో హార్టీకల్చర్ అధికారి మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. జీడిపంటలో తెగుళ్లు ఆశిస్తు మందులు పిచికారీ చేయాలన్నారు. జీడిపంటలో పూతనుంచి పిక్కదశ వరకు సోకే తెగుళ్లు వాటి నివారణ చర్యలను వివరించారు. కొబ్బరి పంట లో తెగుళ్లు అధికమౌతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసు కురాగా తగు చర్యలను సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వన శాఖాదికారి పి.మాధవీలత, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.