Share News

కేంద్రమంత్రి రామ్మోహన్‌పై విమర్శలు తగవు

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:35 PM

దేశాభి వృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడిపై విమర్శలు తగవని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

కేంద్రమంత్రి రామ్మోహన్‌పై విమర్శలు తగవు
వినతులపై అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశాభి వృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడిపై విమర్శలు తగవని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇండిగో సంస్థ తప్పుడు ప్రణాళిక వల్ల నాలుగైదు రోజులుగా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారన్నారు. శ్రీకాకుళం బిడ్డ కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పొగ మంచు సమయంలో కూడా పూర్తి విజిబులిటీతో విమానాన్ని ల్యాండ్‌ చేసే విధానాన్ని తీసుకువచ్చిన కేంద్రమంత్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

శ్రీకాకుళం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. అర్జీదారులతో మాట్లాడుతూ సామాన్యులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కొన్ని వినతులపై సకా లంలో స్పందించి అధికారులతో మాట్లాడి సూచనలిచ్చారు.

విద్యార్థులకు ఉదయం పోషకాహారం

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉద యపు పోషకాహారం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సోమవారం కిష్టప్పపేట జడ్పీ హైస్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. చాలా మంది పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాల కు వస్తున్నారని, దీంతో వారి కోసం అక్షయ పాత్ర పౌష్టికాహారం అందించడం శుభపరి ణామమన్నారు. అనంతరం విద్యార్థులకు పోషకాహారం, చిరుధాన్యాలతో చేసిన చిక్కీ లు, వేరుశనగ, ప్రొటీన్‌ బార్‌లను పంపిణీ చేశారు. ఈ పోషకాహారం శ్రీకాకుళం, గార మండలాల్లో సుమారు 14 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. మంగళ, గురు, శనివారాల్లో ఉదయాన్నే పోషకాహారం అందించేం దుకు నిర్ణయించారని, ఫలితాలు అనుకూలంగా వస్తే వచ్చే ఏడాది నుంచి ఆరు రోజులు అందించేలా చర్యలు తీసు కుంటామన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఎంఈవోలు నక్క రామ కృష్ణ, మురళీకృష్ణ, హెచ్‌ఎం సాయి సంధ్య, సర్పంచ్‌ సత్య వతి, అక్షయపాత్ర రీజనల్‌ మేనేజర్‌ రామమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:35 PM