ప్రజాదరణ చూసి ఓర్వలేకే విమర్శలు: ఎంజీఆర్
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:57 PM
: నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాదరణను చూసి ఓర్వలేక ఢిల్లీలో ఉంటూ ప్రకటనల రూపంలో ప్రభుత్వంపై విమర్శించి ఉనికినిచాటుకొనే రాజకీయాలకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వస్తి చెప్పాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హితవుపలికారు. సోమవారం పాతపట్నంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
పాతపట్నం,అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాదరణను చూసి ఓర్వలేక ఢిల్లీలో ఉంటూ ప్రకటనల రూపంలో ప్రభుత్వంపై విమర్శించి ఉనికినిచాటుకొనే రాజకీయాలకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వస్తి చెప్పాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హితవుపలికారు. సోమవారం పాతపట్నంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లా డుతూప్రభుత్వం అమలుచేస్తున్న ఆటోడ్రైవర్ల సేవ లో పథకాన్ని మాజీఎమ్మెల్యే రెడ్డిశాంతి విమర్శించ డం హాస్యాస్పదమన్నారు. కోట్లాదిరూపాయలు వె చ్చించి చేసిన సేవాకార్యక్రమాలను గుర్తించి ప్రజలు అభిమానించి గెలిపించారన్నారు.ట్రావెల్స్ బస్సుల నుంచి వసూలు చేసుకొనే కర్మ పట్టలేదన్నారు. రెడ్డిశాంతిలా వేలాది కోట్ల బ్లాక్‌మనీ లేదన్నారు. ఆయనవెంట నాయకులు పైల బాబ్జీ, టి.తిరుపతిరావు, తేజేశ్వరరావు, సతీష్ పాల్గొన్నారు.
ఫకొత్తూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్లెమ్మ పంచాయతీకి చెందిని పతివాడ లక్షీకాంతం, పత్రి ఉమామహేశ్వరావు వైద్యం కోసం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. కార్యక్రమంలో కర్లెమ్మ సర్పంచ్ లోతుగెడ్డ భగవాన్ దాస్‌నాయుడు, కొత్తూరు పీఏసీఎస్ అధ్యక్షులు మాతల గాంధి, చోడవరపు రాము, మడపాన రాజారావు, ఎద్దు కృష్ణప్రసాద్, మూగి కృష్ణ పాల్గొన్నారు.