Share News

Liquor Transportation: మద్యం అక్రమ రవాణాకు చెక్‌

ABN , Publish Date - May 13 , 2025 | 12:04 AM

Illegal liquor Liquor transportation మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.

Liquor Transportation: మద్యం అక్రమ రవాణాకు చెక్‌
సిబ్బందితో మాట్లాడుతున్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి

  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డీసీ శ్రీకాంత్‌రెడ్డి

  • ఇచ్ఛాపురం, మే12(ఆంధ్రజ్యోతి): మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం పురుషోత్తపురం చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, విధుల్లో అసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒడిశా నుంచి సారా, మద్యంతోపాటు గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సురంగిరాజా కోటలో ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయాన్ని సందర్శించి.. రికార్డులు పరిశీలించారు. కేసుల నమోదుపై ఆరా తీశారు. నవోదయం-2.0 కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ సీఐ పి.దుర్గాప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:04 AM