Share News

శ్రీముఖలింగంలో గోపూజ

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:36 PM

శ్రీముఖలింగంలో వెలసిన రాధా గోవిందస్వామి ఆలయంలో అర్చకులు గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

శ్రీముఖలింగంలో గోపూజ
జలుమూరు: గోవుకు పూజలు చేస్తున్న దృశ్యం

జలుమూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో వెలసిన రాధా గోవిందస్వామి ఆలయంలో అర్చకులు గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో గోవును అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గోవును నూతన వస్త్రాలతో అలంకరించి మంగళ హారతులు ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వెంకటాచలం మాట్లాడుతూ.. గోమాతను ఎక్కడ పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి విలసిల్లుతుందన్నారు. కార్యక్రమంలో అర్చకులు నవీన్‌దాస్‌, ప్రసాద్‌ పాడీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తర్ర బలరాం, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌, ఎంపీటీసీ కె.హరిప్రసాద్‌, న్యాయవాది చింతాడ వెంకటరమణ, దేవదాయశాఖ సిబ్బంది, పలువురు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

- సంతబొమ్మాళి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కృష్టాష్టమి సందర్భంగా శనివారం గొదలాం, కారిపేట గ్రామాల్లో గోవులకు పూజలు నిర్వహించారు. కారిపేటలో నిరంజన్‌ స్వామిజీ అధ్వరంలో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున్న భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పిలక ధనుంజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:36 PM