Share News

కోర్టు కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌: సీఐ

ABN , Publish Date - May 01 , 2025 | 11:58 PM

: పలాస కోర్టు కాని స్టేబుల్‌ నారాయణను బుధవారం రాత్రి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. గురువారం సీఐ విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు.

కోర్టు కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌: సీఐ

పలాస, మే 1(ఆంధ్రజ్యోతి): పలాస కోర్టు కాని స్టేబుల్‌ నారాయణను బుధవారం రాత్రి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. గురువారం సీఐ విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు. ఆ మేరకు... ఎనిమి దేళ్లుగా కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తూ నారా యణ పలాస కోర్టు కానిస్టేబుల్‌గా వ్యవహరిస్తు న్నారు. కోర్టు ద్వారా కక్షిదారునికి ఇవ్వాల్సిన రూ. 10 లక్షల నగదు, మరో కేసులో 6.5 తులాల బంగారాన్ని సొంతానికి వినియో గించుకున్నాడని ఆయనపై అభియోగాలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎస్‌ఐ చంద్రరావును ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు ఎస్‌ఐ విచారణ చేపట్టి కానిస్టేబుల్‌ నారాయణ నగదు, బంగారాన్ని సొంతానికి వినియోగించుకున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి ఎస్పీకి నివే దించారు. ఈ మేరకు నారాయణను సస్పెండ్‌ చేసి ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ వ్యవ హారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నరసన్నపేట, మే 1(ఆంధ్రజ్యోతి): ఉర్లాం రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొత్తపోలవలసకి చెందిన తలగాన గోవిందరావు (35) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతదేహానికి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

హరిపురం, మే 1(ఆంధ్రజ్యోతి): మందస మండలం రామరాయి గ్రామం లో గురువారం నవోదయం 2.0లో భాగంగా దాడులు చేసి 400 లీటర్లు, గోపిటూరులో 900 లీటర్లు, మొత్తం 1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి నట్లు సీఐ కె.బేబీ తెలిపారు. అనుమానితుడిగా సవర రంగారావును అదుపు లోకి తీసుకున్నామన్నారు. వీఆర్వో తులసీదాసు, సర్వేయర్‌ వినోద్‌ సహకారం తో సారా నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో జీవీ రమణ, ఎస్‌ఐ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:58 PM