పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:22 PM
మండలంలో ని అధిక శాతం రైతులు పత్తి పంటను సాగు చేస్తు న్నారని, పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని అదపాక, గుమడాం ఎంపీటీ సీలు గంట్యాడ సత్యం, జనపాల భానోజీరావు, గోవింద పురం సర్పంచ్ పిల్లా రాముతో పాటు పలువురు సభ్యు లు కోరారు.
- మండల సమావేశంలో కోరిన సభ్యులు
లావేరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలో ని అధిక శాతం రైతులు పత్తి పంటను సాగు చేస్తు న్నారని, పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని అదపాక, గుమడాం ఎంపీటీ సీలు గంట్యాడ సత్యం, జనపాల భానోజీరావు, గోవింద పురం సర్పంచ్ పిల్లా రాముతో పాటు పలువురు సభ్యు లు కోరారు. శనివారం స్థానిక మండల పరిషరిత్ సమా వేశ మందిరంలో ఎంపీపీ లుట్ట అమ్మాజమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అదపాక- వెంకటాపురం, అదపాక- పొందూరు, బుడు మూరు- తామాడ, మురపాక- కుప్పిలి గెడ్డ వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని మండల ప్రత్యేకాహానితుడు రొక్కం బాలకృష్ణ, తామాడ ఎంపీటీసీ రౌతు నారాయణరావు, అదపాక ఎంపీటీసీ గంట్యాడ సత్యంతో పాటు పలువు రు సభ్యులు ఆర్టీసీ అధికారులను కోరారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారి కార్డులను తొలగిస్తామని అన్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లో ఎల్‌పీఎంలు పరిష్కా రానికి రూ.50 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను రూ.49.55కోట్లు మండల అంచనా బడ్జెట్‌ను త యారు చేసినట్లు ఏపీవో ఆర్.సత్యవతి తెలిపారు. గత 16 నెలలుగా ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించలే దని, వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని అదపాక ఎంపీటీసీ గంట్యాడ సత్యం, గుర్రాలపా లేం ఎంపీటీసీ జనపాల భానోజీరావు తదితరులు సభ దృష్టికి తెచ్చారు. జడ్పీటీసీ మీసాల సీతంన్నాయుడు, ఎంపీడీవో పి.వెంకటరాజు, డిప్యూటీ ఎంపీడీవో పద్మజ, ఏఈలు శ్రీవల్లి, కె.అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.