Share News

నారాయణవలసలో రూ.1.50 కోట్లు అవినీతి

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:43 PM

గడిచిన ఐదేళ్లలో నారాయణవలస పంచాయతీలో ఎలాంటి పనులు నిర్వహించకుండా సర్పంచ్‌ రూ.1.50 కోట్లు బుక్కేశారని వ్యవసాయశాఖ మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

నారాయణవలసలో రూ.1.50 కోట్లు అవినీతి
సంతను పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జూలై 13(ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదేళ్లలో నారాయణవలస పంచాయతీలో ఎలాంటి పనులు నిర్వహించకుండా సర్పంచ్‌ రూ.1.50 కోట్లు బుక్కేశారని వ్యవసాయశాఖ మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన నారాయణవలస సంతను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. గత ఐదేళ్లలో సంతలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించకుండా రూ.1.50 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారని, దీనిపై విజలెన్సు ఎంక్వరీ వేస్తే ఎక్కడ పనులు చేసిన ఆనవాలు లేనట్టు తేలిందన్నారు. ఐదేళ్లలో ఆక్రమణదారులు సంతలో పక్కా షెడ్లు నిర్మించు కున్నారని, వారంతా వారం రోజుల్లో తొలగించాలని, లేకుంటే మీరే తొలగించాలని, అలాగే సంత మైదానం మొత్తం సర్వే నిర్వహించి ఎంత స్థలం ఉందో నివేదికలు ఇవ్వాలని టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృ ష్ణమూర్తిని ఆదేశించారు. సంతకు వచ్చే పశువులు తాగేందుకు కనీసం తాగునీటిని కూడా లేకుండా చేశారన్నారు. గడిచిన ఐదేళ్లల్లో సంత నుంచి వచ్చిన ఆదాయం ఎంత అనేది నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌ను ఆదేశించారు. ఏడాదిలో సంతలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి గత వైభవం తీసుకువస్తానన్నారు. అలాగే నారాయణవలస గ్రామానికి నీటి సమస్య ఉందని, ఎన్ని బోర్లు వేసిన వేసవిలో ఇబ్బంది పడుతు న్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. రూ.600 కోట్లతో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి పైపు లైన్‌ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. నిమ్మా డ జంక్షన్‌ నుంచి తిలారు మీదుగా నారాయ ణవలస వరకు రూ.200 కోట్లతో పక్కా సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, వాటి పనులకు మరో పది రోజుల్లో శంకుస్థాపన చేస్తా నన్నారు. అనంతరం నారాయణవలస గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నేతలు బోయిన రమేష్‌, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరావు, పూజారి శైలజ, కర్రి అప్పారావు, తర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:43 PM