Share News

పేదలకు కార్పొరేట్‌ వైద్యం లక్ష్యం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:34 PM

పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొ రేట్‌ వైద్యం అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

పేదలకు కార్పొరేట్‌ వైద్యం లక్ష్యం
అరసవల్లి: రిమ్స్‌లో మెడికల్‌ వార్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొ రేట్‌ వైద్యం అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో మెడి కల్‌ ఐపీ వార్డు, సూపర్‌ స్పెషాలిటీ ఐపీ బ్లాక్‌ను శుక్రవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీజీహెచ్‌లో అన్ని రకాల వైద్యసేవలను అందించేందు కు కట్టుబడి ఉన్నామన్నారు. జీజీహెచ్‌ను ఒక మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దేం దుకు కృషి చేస్తున్నామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ బ్లాక్‌లో న్యూరో, యూరాలజీ, ఆంకాలజీ తదితర ఏడు ప్రత్యేక విభాగాలకు సంబంధించిన ప్రత్యేక చికిత్స లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ సునీల్‌ నాయక్‌, ఆర్‌ఎంవో డా.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యసేవలు పొందండి: ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, డిసెం బరు 12 (ఆంధ్ర జ్యోతి): నిరుపేదలకు మెరిగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుప త్రుల్లో అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేస్తు న్నామని, వీటిని విని యోగించుకోవా లని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. శుక్ర వారం కొండముల గాం సీహెచ్‌సీలో నూత నంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యూనిట్‌, బ్లడ్‌ కలెక్టింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. పెరుగుతున్న రోగుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుం టోందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డా. కల్యాణబాబు, వైద్యులు లలిత, యుగంధర్‌, కూటమి నేతలు దన్నాన సత్తిబాబు, పిన్నింటి భానూ జి నాయుడు, పిసిని జగన్నాఽథంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:34 PM