Share News

టిడ్కో కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:56 PM

రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత్రునివలస టిడ్కో కాలనీలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

 టిడ్కో కాలనీలో కార్డన్‌  సెర్చ్‌
వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీకాకుళం రూరల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత్రునివలస టిడ్కో కాలనీలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. గంజాయి, మద్యం, నిషేదిత పదార్థాలు, సారా, ఆపరిచిత వ్యక్తులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను విచారించి, వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన వాహన పత్రాలు లేని ఒక ఆటో, ఒక కారు, 18 ద్విచక్ర వాహనాలను గుఇ్తంచారు. వన్‌ టౌన్‌ సీఐ పైడపునాయుడు, రూరల్‌ ఎస్‌ఐ కె.రాము సిబ్బంది పాల్గొన్నారు.

చాపరలో..

మెళియాపుట్టి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): చాపర గ్రామంలో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వాహనాల రికార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని రెండు ఆటోలు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించిన, కొత్త వ్యక్తులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి గ్రామంపై నిఘా ఉంచినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అప్పన్న, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:56 PM