Share News

టెక్కలిలో కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:33 PM

టెక్కలి గొల్లవీధి పరిధిలో మంగళ వారం సీఐ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిం చారు.

 టెక్కలిలో కార్డన్‌ సెర్చ్‌
గొల్లవీధిలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు:

టెక్కలి, జూలై 22(ఆంధ్రజ్యోతి): టెక్కలి గొల్లవీధి పరిధిలో మంగళ వారం సీఐ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిం చారు. తనిఖీలు చేసి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం,గంజాయినిల్వలపై ఆరాతీశారు. పాత నేరస్తులు,కొత్త అనుమానిత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వ హించారు. వారి జీవన విధానం, వృత్తి విధానాలపై ఆరాతీశారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోదాల్లో ఎస్‌ఐ రాముతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:33 PM