పట్టణాల్లో కార్డన్ సెర్చ్
ABN , Publish Date - May 29 , 2025 | 11:44 PM
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గురువారం నరసన్నపేట, టెక్కలి, పాతపట్నంలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
నరసన్నపేట/టెక్కలి/పాతపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గురువారం నరసన్నపేట, టెక్కలి, పాతపట్నంలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని పురుషోత్తమనగర్, టెక్కలి ఆదిఆంధ్రా వీధి, పాతపట్నం రెల్లి వీధుల్లో సీఐలు ఎం.శ్రీనివాస రావు, ఎ.విజయ్‌కుమార్, వి.రామారావు ఆధ్వర్యంలో తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిం చారు. కొత్త వ్యక్తులు, అనుమానులు వివ రాలు సేక రించారు. ఇళ్లలో ఉన్నవారి ఆధార్ కార్డులను పరిశీలిం చారు. సరైన ధ్రువ పత్రాలు లేని ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐలు తెలిపారు. కార్యక్రమాల్లో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, పాతపట్నం ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, రంజిత్, అశ్‌కోబాబు, అనిల్ కుమార్, ఎస్. లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.