సమన్వయంతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:26 PM
ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని శ్రీకాకుళం నియో జకవర్గంలో ఉన్న ప్రాం తాలను సమన్వయంతో అభివృద్ధి చేస్తామని ఆమ దాలవలస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్ అన్నారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని శ్రీకాకుళం నియో జకవర్గంలో ఉన్న ప్రాం తాలను సమన్వయంతో అభివృద్ధి చేస్తామని ఆమ దాలవలస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్ అన్నారు. మంగళవారం మునిసిపాలిటీ పరిధి లోని మూడు, నాలుగు, ఆరు, ఏడు వార్డుల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని పల్లెల కు రోడ్ల సదుపాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశలో చర్యలు చేపడు తోందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోని వీధి రోడ్లు కూడా అధ్వానస్థితికి చేరుకున్నాయన్నారు. కూ టమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్ర బాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో రోడ్ల అభివృద్ధికి చర్య లు చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగం గా ఇప్పటివరకు శ్రీకాకుళం, ఆమదాల వలస నియోజకవర్గంలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింద న్నారు. అలాగే పట్టణంలోని 8, 18, 19, 20, 21 వార్డు ల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు కాలువల నిర్మాణా నికి ఎమ్మెల్యే రవికుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిషనర్ తమ్మినేని రవి, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యు డు చాపర సుధాకర్, టీడీపీ నేత మొదలవలస రమేష్, కూన ఆంజనేయులు, బోర గోవింద రావు, జనసేన సమన్వయకర్త పేడాడ రామ్మో హన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమం: శంకర్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 16(ఆంధ్ర జ్యోతి): సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందే లా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఇంజినీరింగ్, మునిసిపల్, రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజల సమస్యలపై తక్షణం స్పందించాలని, సచివాలయాలకు వచ్చే వారికి సేవలు అందేలా చూడాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.