అంబేడ్కర్ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:40 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య కోరారు.
ఎచ్చెర్ల, సెప్టెం బరు 14(ఆంరఽధజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య కోరారు. రిజిస్ట్రార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించి న ఆయన ఆదివారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. అంబేడ్కర్ వర్సిటీలో గ్రామీణ, గిరి జన ప్రాంత విద్యార్థులు అధికంగా ఉన్నత విద్య ను అభ్యసిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వర్సిటీ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు అడ్డయ్య తెలిపారు.
పాత పింఛన్ వర్తింపజేయాలి
ఆమదాలవలస/కవిటి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 ప్రకారం డీఎస్పీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని ఆ ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి తదితరులు కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కవిటిలో ఎమ్మెల్యే బి.అశోక్‌లను కలిసి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పందిస్తూ.. న్యాయపరమైన మీ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్య లు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. వినతిపత్రాలు అందించిన వారిలో ఫోరం రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీనివాసరావు, జిల్లా కో-కన్వీనర్లు గురుగుబిల్లి భాస్కరరావు, అట్టాడ తిరుమలేశ్వరరావు, భాస్కర్ తదితరులున్నారు.