మట్టి నమూనాల సేకరణకు సహకరించండి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:39 PM
ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా ఢిల్లీ నుం చి వచ్చే మట్టి నమూనాలు సేకరణ బృందాలకు ప్రజలు సహకరించాలని తహసీ ల్దార్ సీతారామయ్య, సీఐ తిరుపతిరావుకోరారు.మంగళవారం మోట్టూరులో గ్రామ స్థులతో మాట్లాడారు. మట్టినమూనాలు సేకరణ తరువాత వచ్చే ఫలితాలు ఆధారంగా ప్రజాభిప్రాయసేకరణ ఉంటుందని తెలిపారు.
వజ్రపుకొత్తూరు,జూలై 9(ఆంధ్రజ్యోతి ):ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా ఢిల్లీ నుం చి వచ్చే మట్టి నమూనాలు సేకరణ బృందాలకు ప్రజలు సహకరించాలని తహసీ ల్దార్ సీతారామయ్య, సీఐ తిరుపతిరావుకోరారు.మంగళవారం మోట్టూరులో గ్రామ స్థులతో మాట్లాడారు. మట్టినమూనాలు సేకరణ తరువాత వచ్చే ఫలితాలు ఆధారంగా ప్రజాభిప్రాయసేకరణ ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే తీర ప్రాంతం అభివృద్ధిచెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించా రు. అనంతరం రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నిహార్, సర్వేయర్ తిరుపతిరావు పాల్గొన్నారు.