న్యాయసేవలకు సహకరించండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:46 PM
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ న్యాయ సేవలు ప్రజలకుచేరువ అయ్యేలా స్వచ్ఛంద సంస్థలు సహక రించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి కె. హరిబాబు కోరారు.
శ్రీకాకుళం లీగల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ న్యాయ సేవలు ప్రజలకుచేరువ అయ్యేలా స్వచ్ఛంద సంస్థలు సహక రించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి కె. హరిబాబు కోరారు. మంగళవారం స్థానిక సంస్థ కార్యా లయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వి హంచారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర వహించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల రక్షణ అధికారి రమణ, డిఫెన్స్ న్యాయవాది ఆఫీస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.