సేవా కార్యక్రమాల్లో కొనసాగాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:55 PM
సమాజంలో అన్నిటికంటే సేవ చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో కొనసాగా లని దత్తపీఠ ఉత్తరాధికారి విజయానంద తీర్థస్వామీజీ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పెద్దతామరాపల్లి, కాపుతెంబూ రు గ్రామాల్లో దత్తపల్లి సందర్శనలో భాగంగా పర్యటించారు.
నందిగాం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): సమాజంలో అన్నిటికంటే సేవ చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో కొనసాగా లని దత్తపీఠ ఉత్తరాధికారి విజయానంద తీర్థస్వామీజీ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పెద్దతామరాపల్లి, కాపుతెంబూ రు గ్రామాల్లో దత్తపల్లి సందర్శనలో భాగంగా పర్యటించారు.ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో అనుగ్రహ సందేశంఇచ్చారు.సంకీర్తనలు, సత్సం గాలు, కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చా రు.స్వామీజీని దత్త భక్తులు మేళతాళాలు మధ్య ఊరేగింపుగాతీసుకువెళ్లారు. ఉమామహేశ్వరశర్మ నేతృత్వంలో అనగష్ట వ్రతం వందలాదిమంది భక్తులతో నిర్వహించారు. దీంతో గ్రామాల్లో భక్తి పరవశం నెలకొంది. కార్యక్రమంలో దత్తపీఠ ప్రతినిధి కె.నారాయణరావు, కాపుతెంబూరు దత్త పీఠాధిపతి నిర్వీశ్యానంద స్వామీజీ, ఆయా గ్రామాలకు చెందిన దత్త ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.