విద్యుదాఘాతంతో భవన కార్మికుడి మృతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:24 AM
స్థానిక ప్రభుత్వ ఐటీఐ రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మి కుడు మద్దిల చంద్రశేఖర్(37) మంగళవారం మధ్యా హ్నం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
పలాస, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఐటీఐ రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మి కుడు మద్దిల చంద్రశేఖర్(37) మంగళవారం మధ్యా హ్నం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సూదికొండ కాలనీలో నివాసం ఉం టున్న ఈయన భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలి తం లేకపోయింది. ఈయనకు భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.
గుండెపోటుతో న్యాయవాది..
పలాస, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పలాస, సోంపేట కోర్టులో న్యాయవాది గా వ్యవహరిస్తున్న దానేటి నందగోపాల్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఈయన స్వగ్రామం పలాస మండలం గోపాలపురం. జూనియర్ సివి ల్ న్యాయాధికారి యు.మాధురి అధ్యక్షతన న్యాయవాదులు మౌనం పాటించి ఆ యనకు నివాళులర్పించారు. నందగోపాల్ మృతిపై ఆమె విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయ్యజ్ అహ్మద్, కార్యదర్శి బెండి కాళిదాస్, కోశాధికారి బి.రవి, న్యాయవాదులు సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో ఫీల్డ్ అసిస్టెంట్..
జలుమూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): నగిరికటకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురమాన తవిటయ్య (50) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. తవిటయ్య కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దహన సంస్కరణల కోసం రూ.15 వేలు ఉపాధి హామీ అధికారులు అతడి భార్య రమాదేవికి అందించారు. ఇతడికి భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దుంగ రాంబాబు, కొర్ను రామారావు, రమేష్, నేతింటి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.