కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:08 AM
శ్రీకాకుళంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని విశాఖ-బి కాలనీ,ఈ-కాలనీ, గోవింద్‌నగర్ కాలనీ, శ్రీనివాసనగర్, మహాలక్ష్మీనగర్, సాయిలక్ష్మీ నగర్‌ల్లో పర్యటించారు.

అరసవల్లి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని విశాఖ-బి కాలనీ,ఈ-కాలనీ, గోవింద్‌నగర్ కాలనీ, శ్రీనివాసనగర్, మహాలక్ష్మీనగర్, సాయిలక్ష్మీ నగర్‌ల్లో పర్యటించారు.ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చే స్తున్నామని తెలిపారు.త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్, హెల్త్ అధికారి, నాయకులు పాల్గొన్నారు.