రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:59 PM
ఎస్సీ వర్గీకరణకు, క్రిమీలేయర్ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శుక్రవారం కంచిలిలో కొనసాగింది.
కంచిలి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు, క్రిమీలేయర్ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శుక్రవారం కంచిలిలో కొనసాగింది. యాత్ర నిర్వాహకుడు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి.అశోక్‌బాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు చెన్న కేశవులు కంచిలిలోని వీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేతలు నూతలపాటి బాబూరావు, నగిరి మోహనరావు, డి.వెంకటరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ, సెపెంబరు 12(ఆంధ్రజ్యోతి): దళితులు పాలక పక్షంగా మారితేనే తమ హక్కుల కాపాడుకోగల రని, రాజ్యాంగం వ్యతిరేక వర్గీకరణను రద్దు చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్‌బాబు, పబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా స్థాపకులు దాసరి చెన్నకేశవులు అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ యాత్రలో భాగంగా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తలపెట్టిన యాత్ర శుక్రవారం పలాస చేరుకొని, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సభ్యులు కృష్ణారావు, పాపా రావు, శంకర్, పద్మలోచన్, జీవన్‌బాబు, దుర్యోదనరావు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్‌కు వ్యతిరేకంగా రా జ్యాంగ పరిరక్షణ, మాలల ఆత్మీయ పాదయాత్రను శుక్రవారం టెక్కలిలో నిర్వహిం చారు. ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కొనసాగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు అశోక్‌బా బు తెలిపారు. కార్యక్రమంలో దాసరి చెన్నకేశవులు, చల్లా రామారావు, బాబూరావు, ధనుంజయరావు, డీఏ స్టాలిన్, కామేశ్వరరావు, గడ్డయ్య, సుంకు గోపీనాథ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి మాలలకు అన్యాయం చేసిన సీఎం చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర డైరెక్టర్ చెన్న కేశవులు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం ఇచ్ఛాపురంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆ సంఘాల నేతలు సల్ల దేవరాజ్, ఎన్.బాబూరావు, ఎన్.మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.