Share News

రూ.518 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:35 PM

పలాస నియోజక వర్గంలో రూ.518 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా మని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

రూ.518 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
జల్‌జీవన్‌ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పలాస నియోజక వర్గంలో రూ.518 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా మని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధ వారం బెండి, నువ్వలరేవు, మంచినీళ్లపేటల్లో రూ.3.80 కోట్లతో చేపట్టిన జల్‌జీవన్‌ పనుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో మాజీ మం త్రి అప్పలరాజు ప్రచార ఆర్భాటాలే తప్ప ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోనే రూ.518 కోట్లు నిధులు మంజూరు చేయించామన్నారు. గత ఐదుళ్ళుల్లో రైతాంగానికి సాగు నీరు అం దించలేకపోయారన్నారు. కాని తాను ఎమ్మెల్యే గా గెలిచిన 20 రోజుల్లోనే వంశధార నీటిని శివారు భూములకు అందించానన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. వంశ ధార కాలువల్లో పూడికతీత చేపటా ్టమని, చెక్‌ డ్యాంల నిర్మాణం చేపడుతున్నామ న్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధ జలాలను అందించేందుకు యుద్ధప్రాతిపదిక న పనులు జరుగు తున్నట్లు చెప్పారు.

త్వరలో బెండి రోడ్డు పనులు

గత పాలకులు నిధులు విడుదల చేయక పోవడంతో బెండి రోడ్డు పనులు నిలిచిపోయాయని, సంబంధిత కాంట్రాక్టర్‌కు పెండింగ్‌ బిల్లులు చెల్లించి వచ్చే నెల 20 నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సమా వేశంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూ రావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, నువ్వలరేవు సర్పంచ్‌ పూర్ణ, మంచినీళ్లపేట మాజీ సర్పంచ్‌ గుల్ల చిన్నారావు, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌ నాయుడు, మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు, నేతలు ఎ.ఉమామహేశ్వరరావు, పి.సాంబమూర్తి, కణితి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:35 PM