Share News

ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ను జయించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:06 AM

ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ను జయించాలని హోంమంత్రి అనిత సూచించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద శివాలయం వీధిలో నివాసముంటున్న లతశ్రీని కలిశారు. తొమ్మిదేళ్లుగా లతశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతోంది. కొంతకాలంగా యూట్యూబ్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియోలు విని ఆమె స్పూర్తితో కోలుకుంటోంది.

   ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ను జయించాలి
లతశ్రీతో మాట్లాడుతున్న వంగలపూడి అనిత:

శ్రీకాకుళంక్రైం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ను జయించాలని హోంమంత్రి అనిత సూచించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద శివాలయం వీధిలో నివాసముంటున్న లతశ్రీని కలిశారు. తొమ్మిదేళ్లుగా లతశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతోంది. కొంతకాలంగా యూట్యూబ్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియోలు విని ఆమె స్పూర్తితో కోలుకుంటోంది. డాక్టర్లు సైతం మందులకు స్పందించని లతశ్రీ హోంమంత్రి మాటలకు స్పందిస్తుండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె భర్త ఆనంద్‌ తన భార్య కోరికను తీర్చాలని హోంమంత్రిని కోరాడు.దీంతో స్పందించిన హోంమంత్రి అనిత బుధవారం జిల్లాలో పర్యటించిన సందర్భంగా లతశ్రీ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. నిత్యం టీవీలో కనిపించే స్ఫూర్తిదాత తన ఇంటికి రావడంతో ఆమె ఆనందానికి అవదులులేకుండా పోయాయి. లతశ్రీని కలిసిన హోంమంత్రి పలకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకు న్నారు. అనితను కలవడం తన కల అని, ఆరోగ్యం క్షిణించడంతో భర్త, పిల్లలను కనీసం నోరు తెరిచి పిలవలేకపోతున్నాని లతశ్రీ హోంమంత్రి వద్ద విలపించింది.లతశ్రీ వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిఫర్‌ చేస్తానని హోంమంత్రి భరోసాఇచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో ఆమె మాట్లాడారు. తక్షణం సీఎంతో మాట్లాడతామని అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా తొలుత అనితను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెం కటరమణ, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ కలిశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:06 AM