సర్వే నిర్వహిస్తే ప్రతిఘటన తప్పదు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:05 AM
సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గాను ఆదివాసీ గ్రామాల్లో రాత్రి సమయాల్లో అక్రమ సర్వేలు నిర్వహిస్తే ప్రతిఘటన తప్పదని రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగి హెచ్చరించారు.
సరుబుజ్జిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గాను ఆదివాసీ గ్రామాల్లో రాత్రి సమయాల్లో అక్రమ సర్వేలు నిర్వహిస్తే ప్రతిఘటన తప్పదని రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగి హెచ్చరించారు. శుక్రవారం బూర్జ మండలం అడ్డూరిపేటలో థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు ఒక చెట్టు భూమి కూడా ఆదివాసీ రైతులు ఇవ్వడం జరిగదని ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రజలఆమోదంలేకుండా, రైతులు,ఆదివాసీలకు సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయా ల్లో డ్రోన్లతో సర్వే చేపడుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి సమర సింహాచలం, సవర వెంకటరమణ, జాన్,ఆదెయ్య, మిన్నారావు, ధర్మారావు పాల్గొన్నారు.