సిరిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించండి: ఎస్పీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:58 PM
పెద్దమ్మతల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సిబ్బందికి ఆదేశించారు. సిరిమాను తిరిగేరూట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఉండరాదని, భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని కోరారు.
శ్రీకాకుళం క్రైం, జూన్ 8(ఆంధ్రజ్యోతి):పెద్దమ్మతల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సిబ్బందికి ఆదేశించారు. సిరిమాను తిరిగేరూట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఉండరాదని, భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని కోరారు. శ్రీకాకుళం పట్టణం, పాత శ్రీకాకుం, మావూరువీధి, కలెక్టర్ బంగ్లా, హరిజనవీధి, బాదుర్లుపేట, కొత్తపేట, కునుకుపేట, దండివీధి, దేశర్లవీధి, నక్కవీధి పరి సర వీధుల్లో మంగళవారం పెద్దమ్మతల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవం జరగనున్న నేపధ్యంలో రూట్‌మ్యాప్, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు తదితర ఏర్పాట్లపై ఆదివారం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి పరిశీలించారు. జిల్లాపరిషత్, నక్కవీధి, సంతోషిమాతగుడి, కలెక్టర్‌బంగ్లా తదితర రహదారి మార్గంలో ఎస్పీ తనిఖీచేశారు. భక్తులదర్శనం, క్యూలైన్లు, బందోబస్తు ఏర్పా ట్లను పర్యవేక్షించి సిరిమాను వెళ్లే మార్గంలో పరిశీలించి సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు లేకుండా ఆ శాఖాధికారుల సాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను బట్టి మునిసిపల్‌అధికారులు సమన్వయంతో రహదారికి ఇరువైపులా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటుచేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆల యంలోపల, క్యూలైన్లవద్ద, ముఖ్య కూడళ్లు,సిరిమాను ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద సీఐలు పైడిపునాయుడు, నాగరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.