రాజీయే రాజమార్గం
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:47 PM
కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని వివిధ కోర్టుల న్యాయాధికారులు తెలిపారు.
- జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయాధికారులు
- ఎనిమిది కోర్టుల్లో 1104 కేసుల పరిష్కారం
కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని వివిధ కోర్టుల న్యాయాధికారులు తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి 1104 కేసులను పరిష్కరించారు. ఇందులో సివిల్, క్రిమినల్, ఎక్సైజ్, మనోవర్తి తదితర కేసులు ఉన్నాయి. రాజీ పడడం వల్ల ఇరు వర్గాలూ గెలిచినట్లేనని వారు చెప్పారు.
ఇచ్ఛాపురంలో 200 కేసులు..
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 200 కేసులను రాజీ చేసినట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి పి.ఫరీష్‌కుమార్ తెలిపారు. ఈ కేసుల ద్వారా రూ8.77లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట అప్పారావు న్యాయవాదులు బైరాగిరెడ్డి, రమణయ్యరెడ్డి, నాగరాజుపాత్రో, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేటలో 111..
నరసన్నపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక సివిల్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. 111 కేసులు పరిష్కారమైనట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.వాణి తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
పలాసలో 225..
పలాస, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 225 పరిష్కారమైనట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి యు.మాధురి తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ ఫయ్యజ్ అహ్మద్, ఉపాధ్యక్షుడు బికెఆర్.పట్నాయక్, సీనియర్ న్యాయవాదులు పైల రాజరత్నంనాయుడు, ఎస్.వెంకటరమణ, తాండ్ర మురళీమోహన్, డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, సీఐలు పి.సూర్యనారాయణ, తిరుపతిరావు పాల్గొన్నారు.
పొందూరులో 206..
పొందూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పొందూరు కోర్టులో న్యాయాధికారి బి.జ్యోత్స్న ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 206 వివిధ కేసులను పరిష్కరించారు. తద్వారా సివిల్ కేసుల కక్షిదా రులకు రూ.50.60 లక్షలు లబ్ధి చేకూరింది. ప్రభుత్వానికి రూ.15.57 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. న్యాయవాదులు కె.మంజుల, పి.రామ్మోహన్, బ్రహ్మాజీ, ఎం.రాము, కిరణ్, అప్పలనాయుడు పాల్గొన్నారు.
పాతపట్నంలో 69..
పాతపట్నం, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం జూనియర్ సివిల్ కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 69 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రిన్సిపల్ సివిల్ న్యాయాధికారి ఎం.శ్రీధర్ తెలిపారు. ఆయా కేసుల్లో రూ.2,71,240 అపరాధ రుసుం విధించారు. న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
సోంపేటలో 61..
సోంపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 61 కేసులు రాజీ చేసినట్లు సీనియర్ సివిల్ న్యాయా ధికారి జె.శ్రీనివాసరావు, ఒకటో బెంచ్, జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో క్రిమినల్ 24, మనోవర్తి 1, సివిల్ దావాలు 8తో పాటు 28 ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కోటబొమ్మాళిలో 147..
కోటబొమ్మాళి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 147 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 3, క్రిమినల్ 22, ఎక్సైజ్ ఒకటి, ప్లీబార్గయినింగ్ ద్వారా రాజీ అయిన కేసులు 80, అడ్మిషన్ 39, మనోవర్తి రెండు కేసులు ఉన్నాయి. జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.వాణి, న్యాయవాదులు జీవన్, తిరుమలరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టెక్కలిలో 85..
టెక్కలి సెప్టెంబరు 13(ఆంద్రజ్యోతి): టెక్కలి కోర్టుల సముదాయంలో జరిగిన లోక్ అదాలత్‌లో 85 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల, ఫుల్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి యు.మాధురి తెలిపారు. సివిల్ కేసులు 4, క్రిమినల్ 45, ఎక్సైజ్ 29, ఇతర కేసులు 7 పరిష్కరించి రూ9,10,100 అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో అదాలత్ సభ్యులు పి.చంద్రుడు, ఐ.మల్లేసు, బి.శ్రీనివాసరావు, టెక్కలి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.