Share News

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:32 PM

ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించేలా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు.

సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించేలా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికా రులకు సూచించారు. ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్య ర్థుల శిక్షణ నిర్వహణపై శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత కానిస్టేబుళ్లపై ఉందని, అందువల్ల శిక్షణా కాలంలో అభ్యర్థులను నాణ్యమైన వసతి, భోజన సదు పాయాలు అందించాలన్నారు. ప్రతిరోజు ఫిజికల్‌ ట్రైనింగ్‌ తో పాటు యోగా వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. నూత నంగా అమలవుతున్న చట్టాలు, పోలీస్‌ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలని, నేర పరిశోధనలో ఉపయో గించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీ హెచ్‌ వివేకానంద, డి.లక్ష్మణరావు, సీఐలు, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:32 PM