అందరి సహకారంతో సమగ్రాభివృద్ధి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:50 PM
నియోజక వర్గంలోని నాలుగు మండలాలతో పాటు ఆమదాలవలస మునిసిపాలిటీ సమగ్రాభివృద్ధికి అందరి సహకారం తీసుకుం టామని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలోని నాలుగు మండలాలతో పాటు ఆమదాలవలస మునిసిపాలిటీ సమగ్రాభివృద్ధికి అందరి సహకారం తీసుకుం టామని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం లో రిటైర్డ్ మునిసిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్, తహసీల్దార్ పేడాడ జనార్దనరావు తదితరులు ఆయనను కలిశారు. అనంతరం ఆయన వారితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అందరి సహ కారంతో సీఎం చంద్రబాబునాయుడు చొరవతో సమగ్ర అభి వృద్ధి సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం బాధాకరమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి స్థానికులకు అవగా హన కలిగించడంతో పాటు వాటిని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కా రానికి కృషి చేస్తానన్నారు. నిరు ద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనతో పాటు వివిధ కంపెనీల ద్వారా జాబ్‌మేళాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింద న్నారు.
బాధితులకు పరామర్శ
బూర్జ, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): పెద్దపేట పంచాయతీ కొండపేటలో రైతులు మజ్జి సూర్య నారాయణ, పాలక వరాలమ్మకు చెందిన వరి కుప్పలు గుర్తుతెలి యని వ్యక్తులు నిప్పుపెట్టిన విష యం తెలుసుకుని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పరామర్శిం చారు. నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందిం చాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరె క్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు, నీటి సంఘాల అధ్యక్షుడు కడడగల కృష్ణ, స్థానిక నాయకుడు వావి లపల్లి నారాయణరావు పాల్గొ న్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.