సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:38 PM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ అవసరమని ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.
అరసవల్లి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఉద్యో గుల సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ అవసరమని ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. స్థానిక జడ్పీ సమా వేశ మందిరంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కొత్త పీఆర్సీని వేయాలని డిమాండ్ చేశారు. తాలూకా మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు సంఘ కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరం తరం పనిచేస్తుందన్నారు. ఐక్యతతో సమష్టి పోరాటం ద్వారా సమ స్యల పరిష్కారానికి మార్గం లభిస్తుం దన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీం ఇప్పటికీ సరిగా అమలు చేయడం లేదని, కొత్త పీఆర్సీ వేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనాలు సరిగా దక్కడం లేదన్నారు. త్వరలో విజయవాడలో రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, జేఏసీ జిల్లా అధ్య క్షుడు హనుమంతు సాయిరాం, పూర్వ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు, నేతలు జాన కి, ఎం.రాజ్యలక్ష్మి, ఎం.సరస్వతి, జి.హైమవతి, పి. శ్రావణి తదితరులు పాల్గొన్నారు.