Share News

ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేయండి

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:42 PM

నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్‌ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు.

ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేయండి
క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్‌ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మేడిపల్లి రాంప్రసాద్‌ రెడ్డిని వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా బగ్గు మాట్లాడుతూ.. ఇండోర్‌ స్టేడి యానికి గత టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో చల్లవానిపేట సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:42 PM