కలెక్టరేట్ భవనాన్ని సకాలంలో పూర్తిచేయండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:58 PM
సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్ర వారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రోడ్లు, భవనాల శాఖ అధికా రులతో కలిసి నూతన భవన సముదా యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలకు అను గుణం గా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్ తదితరు లు పాల్గొన్నారు.