Share News

సేంద్రియ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:05 AM

: సేంద్రియ ఉత్ప త్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభి స్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శుక్రవారం శ్రీకాకు ళంలోని రైతు బజారు వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు సేంద్రి య ఉత్పత్తుల మొబైల్‌ వాహనా లను ప్రారంభించారు.

సేంద్రియ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం
సహజ ఉత్పత్తుల వాహనం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సేంద్రియ ఉత్ప త్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభి స్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. శుక్రవారం శ్రీకాకు ళంలోని రైతు బజారు వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు సేంద్రి య ఉత్పత్తుల మొబైల్‌ వాహనా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసా యన ఎరువులు, పురుగుమందులు వాడకుండా కంపోస్టు, పచ్చిరొట్ట వంటి జీవాధార ఎరువులతో పంటలు పండిం చాలని కోరారు. ప్రజారోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యతని, సహజ ఉత్పత్తులను ప్రోత్స హించడం, వాటిని ప్రజలు వినియోగించేలా చేయడం తమ కర్తవ్యమన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:05 AM