సకాలంలో ఫిర్యాదులు పరిష్కరిస్తా: ఎస్పీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:22 AM
సకాలంలో ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అ న్నారు.
పలాస, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సకాలంలో ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అ న్నారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీ స్టేషన్ ఆవరణలో ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలు సుకున్నారు. ప్రతి సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో, శు క్రవారం కాశీబుగ్గ పోలీస్టేషన్‌లో ప్రజాఫిర్యాదులు స్వీకరించడం జరుగు తుందన్నారు. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా అవస రమైన చర్యలు తీసుకుంటానన్నారు.