Share News

మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:09 AM

ఎంఎస్‌ పల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించలేదని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, వార్డెన్‌ పొందూరు రమ్య శనివారం కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు

కంచిలి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎంఎస్‌ పల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించలేదని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, వార్డెన్‌ పొందూరు రమ్య శనివారం కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కళాశాల హాస్టల్‌లో ఉండి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టిన తరువాత స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో ప్రిన్సిపాల్‌, సిబ్బంది సమీప ప్రాంతాల్లో గాలించారు. ఆమె స్నేహితులను విచారించగా, ఎవరికీ తెలియదని చెప్పడంతో సమాచారాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు. శుక్రవారం సాయంత్రం విద్యార్థిని, కంచిలి రైల్వే స్టేషన్‌ వద్ద కనిపించినట్లు కొందరు చెప్పినట్టు సమాచారం. శనివారం విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

Updated Date - Dec 07 , 2025 | 12:09 AM