Share News

బ్యాంకు మిత్రపై ఫిర్యాదు

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:25 AM

మండలంలో తునివాడకు చెందిన బ్యాంకు మిత్ర(యూనియన్‌ బ్యాంకు రేగిడి శాఖ సీఎస్పీ) అల్లు శ్రీధర్‌ పొదుపు సంఘాల సొమ్ము స్వాహా చేసిన వ్యవహారం రేగిడి పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

బ్యాంకు మిత్రపై ఫిర్యాదు

రేగిడి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో తునివాడకు చెందిన బ్యాంకు మిత్ర(యూనియన్‌ బ్యాంకు రేగిడి శాఖ సీఎస్పీ) అల్లు శ్రీధర్‌ పొదుపు సంఘాల సొమ్ము స్వాహా చేసిన వ్యవహారం రేగిడి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సోమవారం స్థానిక సాయిలక్ష్మి గ్రామైఖ్య సంఘ ప్రతినిధులు శారద, గౌరీశ్వరీ, సుజాత ఆధ్వర్యంలో 39 సంఘాల సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేశారు. బ్యాంకుమిత్రగా పనిచేస్తున్న శ్రీధ ర్‌ తమ బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, పొదుపు సొమ్ములు రేగిడి యునియన్‌ బ్యాంకుకు అందజేయకుండా తమను మోసం చేశాడని ఆరోపించారు. ఇటీవల డీఆర్‌డీఏ అధికారుల దర్యాప్తులో కూడా తమకు సంబంధించిన పొదుపు, స్త్రీనిఽధి, లింకేజీ సొమ్ములు కలిపి రూ.43,43 లక్షలు కాజేసినట్టు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తుప్పుడు రసీదులు ఇచ్చినట్టు కొన్ని ఆధారాలు వారు పోలీసులకు చూపించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని కోరారు. హెచ్‌సీ అప్పారావు వీరి వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించా రు. వీరి వెంట తునివాడ టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు, ఏపీఎం గోవిందరావు ఉన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:25 AM