Share News

ప్రతిభ వెలికితీతకు పోటీలు దోహదం

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:46 PM

యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం చేస్తాయని శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మె ల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి అన్నారు.

ప్రతిభ వెలికితీతకు పోటీలు దోహదం
యువజనోత్సవాల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌, చిత్రంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు

శ్రీకాకుళం రూరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం చేస్తాయని శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మె ల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి అన్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలను మునసబుపేట గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీలో మంగళవారం వారు ప్రారంభించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. యువజనోత్సవ పోటీ లంటే కేవలం డాన్సులు మాత్రమే అనే అపోహ అంద రిలో ఉందని, ఇది సరికాదని, వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ప్రతిభ ను ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ.. జాతీయ యువజనోత్సవం సంద ర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి కీర్తి పొందాల న్నారు. ఆమదావలస ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖ రాలను అందుకోవాలని ఆకాంక్షించారు. సెట్‌శ్రీ సీఈవో వీవీ అప్పలనాయుడు మాట్లాడుతూ... జిల్లాస్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీ యువకులు జాన పద గీతాలు, జానపద నృత్యాలు, తప్పెటగుళ్లు తదితర అంశాల ను ప్రదర్శించారు. వయోజన విద్య డీడీ సోమేశ్వరరావు, పర్యాటక అధికారి నారాయణరావు, మై భారత్‌ శాఖ డీడీ ఉజ్వల్‌, గురజాడ ఎడ్యుకే షనల్‌ సోసైటీ డైరెక్టర్‌ సంయుక్త, ప్రిన్సిపాల్‌ కేవీవీ సత్య నారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వై.పోలినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో ఆర్‌.శ్రీనివాస పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:46 PM