తొక్కిసలాటలో గాయపడినవారికి పరిహారం అందజేత
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:52 PM
కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి (చిన్నతిరుపతి) ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసటలో గాయపడిన వారికి మంజూరైన పరిహారాన్ని గురువారం తహసీల్దార్ సీతారామయ్య, టీడీపీ నాయకులు అందించారు.
వజ్రపుకొత్తూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి (చిన్నతిరుపతి) ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసటలో గాయపడిన వారికి మంజూరైన పరిహారాన్ని గురువారం తహసీల్దార్ సీతారామయ్య, టీడీపీ నాయకులు అందించారు. శివరాం పురం గ్రామానికి చెందిన దట్టి ఆదమ్మ, సీతాపురం గ్రామానికి చెందిన దుంప భార తిలకు ఒక్క్కొరికీ రూ.లక్ష చొప్పున్న చెక్కులను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సూరాడ మోహనరావు, కర్ని రమణ, మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు, పీఏసీఎస్ చైర్మన్ కణితి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి రూరల్: మండంలో గల బూరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి మృతి చెందగా పిన్నింటి సూరమ్మ, గౌరి గాయప డ్డారు. వీరికిపరిహారంగా ప్రభుత్వం రూ.లక్ష చొ ప్పున్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బాధితులకు చెక్కలు అందజేశారు. కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ చెర్మన్ బగాది శేషగిరావు, టీడీపీ నాయకులు గణపతిరావు, దమయంతి, ప్రపాద్‌రెడ్డి, మాధవరావు.సంజీవ్, రూపవతి పాల్గొన్నారు.